అత్తల ఇంటెలిజెన్స్ ముందు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఏమీ చేయలేదు
on Apr 12, 2025
.webp)
డ్రామా జూనియర్స్ సీజన్ 8 చూడబోతే ఈ సీజన్ మాములుగా ఉండేలా లేదు అనిపిస్తోంది. ఈ సీజన్ లో స్వేచ్ఛ అనే చిన్నారితో కలిసి జడ్జ్ రోజా కూడా స్కిట్ లో పార్టిసిపేట్ చేసింది. రోజా అత్తగారిగా స్వేచ్ఛ కోడలిగా చేసింది. "ఈ అత్తలను కంట్రోల్ లో ఎలా పెట్టాలని ఏఐని అడిగాను..కానీ అత్తల ఇంటెలిజెన్స్ ముందు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఏమీ చేయలేదు అని ఆన్సర్ ఇచ్చింది." అని రోజాకు కౌంటర్ ఇచ్చింది స్వేచ్ఛ. వెంటనే సుధీర్ వచ్చి రింగులు బాగున్నాయండి అన్నాడు. "సెట్ లో రింగులు బాగున్నాయంటారు. బయటకు వెళ్ళాక మీ అసలు రంగులు చూపిస్తారు" అని కౌంటర్ వేసింది రోజా.
ఇక స్వేచ్ఛ ఐతే "ఏంటత్తా రుసరుసలాడిపోతున్నావ్" అంటూ తెగ నడుము ఊపేస్తూ రోజాను అడిగింది. "నాతో పెట్టుకోకు. మొన్న ఒకడు ఇలాగే నాతో పెట్టుకుని ఎక్కడ మూడుతుందో అని మౌన వ్రతంతో దేవుడికి మొక్కుకుంటున్నాడు" అంది రోజు. "ఐనా వాడికి మూడకుండా ఉండాలి అంటే నువ్వు కదా మౌన వ్రతం చేయాలి" అంటూ రోజని తిరిగి ప్రశ్నించింది. "నేను ఎంత మంచి దాన్ని అండి. ఎవరైనా మీట్ ఐతే ఎంత బాగా చూసుకుంటాను" అని రోజా చెప్పింది. "నిన్ను మీట్ ఐతే బానే ఉంటుంది. కానీ ప్రెస్ మీట్ ఐతేనే ఎవరికో మూడిద్ది..ఈ షో స్టార్ట్ ఐన దగ్గర నుంచి అనిల్ గారు కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఎక్కడ మూడుద్దో ఏమో అని" అంటూ స్వేచ్ఛ క్యూట్ గ డైలాగ్స్ చెప్పేసరికి రోజా నోరెళ్లబెట్టింది. ఇక తర్వాత అత్తా కోడళ్ళుగా స్కిట్ వేసిన స్వేచ్ఛ- రోజా దగ్గరకు అనిల్ రావిపూడి వచ్చాడు. ఇద్దరూ వంటలు చేస్తూ ఉంటారు. "మీ పేరు అనిల్ ..మీరు రాకుంటే సంక్రాంతి నిల్" అంటూ డైలాగ్ చెప్పింది రోజా. దానికి స్వేచ్ఛ "నువ్వు ఎంత భజన చేసినా నా వంటే బాగుందని చెప్తారు" అంటూ చెప్పింది. వెంటనే ఇద్దరూ పాయసం గిన్నెలు తెచ్చి ఇచ్చేసరికి అనిల్ పారిపోయాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



